EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్దూర్, దూల్మిట్ట మండల కేంద్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author R K SRINIVAS | 15 Aug 2026, 08:12 PM | TELANGANA
    మద్దూర్, దూల్మిట్ట మండల కేంద్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    త్రివర్ణ పతాకాలతో మార్మోగిన మండల కేంద్రాలు
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 15: సిద్దిపేట జిల్లా మద్దూరు, దూల్మిట్ట మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
    మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో రహీమ్, మద్దూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దామెర మల్లేశం, ఎంపీడీవో కార్యాలయంలో రామ్మోహన్, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ అసిఫ్, మోడల్ స్కూల్‌లో నరేందర్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
    మద్దూరు, దూల్మిట్ట మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు.
    ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు.
    పాఠశాలల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.