మద్దూర్, దూల్మిట్ట మండల కేంద్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
త్రివర్ణ పతాకాలతో మార్మోగిన మండల కేంద్రాలు హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 15: సిద్దిపేట జిల్లా మద్దూరు, దూల్మిట్ట మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో రహీమ్, మద్దూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దామెర మల్లేశం, ఎంపీడీవో కార్యాలయంలో రామ్మోహన్, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ అసిఫ్, మోడల్ స్కూల్‌లో నరేందర్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మద్దూరు, దూల్మిట్ట మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ...