EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జాతీయ జెండాను ఆవిష్కరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,ఎస్పీ

    Author THADEM PRASHANTH | 15 Aug 2026, 06:58 PM | Array
    జాతీయ జెండాను ఆవిష్కరించిన  రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,ఎస్పీ

    జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
    స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ

    హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల జిల్లా: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.
    అంతకుముందు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోనూ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పలువురు విద్యార్థులకు నోట్‌బుక్‌లను అందజేశారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్వో జయశ్రీ, ఏఓ రాంరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

    జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
    జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ మహేష్ బి. గితే

    హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
    దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ అన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో దేశ సమగ్రత, ఐక్యతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
    ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, చట్టబద్ధ పాలనతో పాటు ప్రజలకు స్నేహపూర్వకమైన, పారదర్శకమైన, సాంకేతికత ఆధారిత పోలీసింగ్ సేవలు అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని అధికారులకు సూచించారు.
    ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఏఓ, ఎస్‌ఐలు, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

    జాతీయ జెండాను ఆవిష్కరించిన  రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,ఎస్పీ  - Additional Image