జాతీయ జెండాను ఆవిష్కరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,ఎస్పీ
జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల జిల్లా: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోనూ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పలువురు విద్యార్థులకు నోట్‌బుక్‌లను అందజేశారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ...