EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముస్త్యాల స్కూల్ లో ఉత్తమ విద్యార్థులకు మెమెంటోలు ప్రధానం

    Author P శివశంకర్ | 15 Aug 2026, 06:06 PM | TELANGANA
    ముస్త్యాల స్కూల్ లో ఉత్తమ విద్యార్థులకు మెమెంటోలు ప్రధానం

    పేద విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేత
    హిందుస్థాన్ మీడియా, ముస్త్యాల, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్త్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, పేద విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు. కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
    2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన **వానరాసి సాయి తేజ (533), గందె నందిని (516), పోలోజు నందకిషోర్ (504)**లను మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. అలాగే పాఠశాలలోని వివిధ తరగతుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కొంగరి వెంకట మావో మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ముస్త్యాల పాఠశాలకు, తల్లిదండ్రులకు, తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని సూచించారు.
    విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు సామాజిక బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య, మానవ హక్కులు, సామాజిక న్యాయం పరిరక్షణకు యువత, మేధావులు, ప్రగతిశీలవాదులు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో రేపాక కుమార్, ఎండి ఎజాజ్, గూండ్ర రవీందర్, కొంగరి చంద్రమౌజుందార్, చింతకింది డానియల్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ మిన్నాలపురం రజిత వరేష్, ఉపసర్పంచ్ బైకన కమలాకర్, మాజీ సర్పంచ్ పెడుతల ఎల్లారెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

    ముస్త్యాల స్కూల్ లో ఉత్తమ విద్యార్థులకు మెమెంటోలు ప్రధానం  - Additional Image