ముస్త్యాల స్కూల్ లో ఉత్తమ విద్యార్థులకు మెమెంటోలు ప్రధానం
పేద విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేత హిందుస్థాన్ మీడియా, ముస్త్యాల, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ముస్త్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, పేద విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు. కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన **వానరాసి సాయి తేజ (533), గందె నందిని (516), పోలోజు నందకిషోర్ (504)**లను మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. అలాగే పాఠశాలలోని వివిధ తరగతుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కొంగరి వెంకట...