EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అయినాపూర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    Author M KIRAN KUMAR | 15 Aug 2026, 04:46 PM | TELANGANA
    అయినాపూర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ కళ్యాణి కృష్ణ
    హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కళ్యాణి కృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
    ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, వీఓఏలు, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కళ్యాణి కృష్ణ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.
    గ్రామానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని తెలిపారు.
    గ్రామసభలో సంక్షేమ పథకాలపై అవగాహన
    అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పెన్షన్లకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి కుటుంబం పొందేలా అవగాహన కల్పించారు.