అయినాపూర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ కళ్యాణి కృష్ణ హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కళ్యాణి కృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, వీఓఏలు, గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి కార్యక్రమాన్ని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కళ్యాణి కృష్ణ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల...