EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థుల ప్రతిభకు అనిల్ రాజు గౌడ్ ప్రోత్సాహం

    Author THADEM PRASHANTH | 15 Aug 2026, 02:51 PM | TELANGANA
    విద్యార్థుల ప్రతిభకు అనిల్ రాజు గౌడ్ ప్రోత్సాహం

    రామునిపట్లలో ప్రతిభా పురస్కారాల వేడుక

    పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు
    హిందుస్థాన్ మీడియా న్యూస్, చిన్నకోడూర్: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రామునిపట్ల గ్రామంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామునిపట్ల గ్రామ హైస్కూల్‌లో 2026 పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
    గతంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ యువ నాయకుడు, దాత అనిల్ రాజు గౌడ్ విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు.
    🥇 ప్రథమ స్థానం – రూ.3,000
    🥈 ద్వితీయ స్థానం – రూ.2,000
    🥉 తృతీయ స్థానం – రూ.1,500
    🏅 నాలుగో స్థానం – రూ.1,000
    ఈ సందర్భంగా అనిల్ రాజు గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి సాధించిన విజయాన్ని ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
    విద్యార్థులకు అందించే చిన్నపాటి ప్రోత్సాహం కూడా వారి భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగడానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. రామునిపట్ల గ్రామానికి మరింత పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఆకాంక్షించారు.
    ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, విద్యార్థులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.