EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శాస్త్రోక్తంగా ఆండాళ్ తిరు నక్షత్రోత్సవం

    Author P శివశంకర్ | 14 Aug 2026, 10:31 PM | Bhakti, TELANGANA
    శాస్త్రోక్తంగా ఆండాళ్ తిరు నక్షత్రోత్సవం

    శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వైభవంగా ఆండాళ్ గోదాదేవి జయంతి వేడుకలు
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఆండాళ్ (గోదాదేవి) తిరు నక్షత్రోత్సవం, జన్మదిన వేడుకలను శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు.
    ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ప్రేమ, భక్తి, సేవల ద్వారా సాక్షాత్తు భగవంతుడిని పొందవచ్చని ఆచరించి చూపిన మహాభక్తురాలు ఆండాళ్ గోదాదేవి అని ఈ సందర్భంగా భక్తులు స్మరించుకున్నారు.
    ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు రాజు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రభాత సేవ, తిరుమంజనం, పంచసూక్త పారాయణం, పంచామృత అభిషేకం, ద్రావిడ ప్రబంధ సేవాకాలం, పాశుర పారాయణం, తనియనుల విన్నపం తదితర శాస్త్రోక్త కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
    ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఆండాళ్ గోదాదేవి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ తిరు నక్షత్రోత్సవంలో సరోజిని, పద్మ, లక్ష్మి, సరిత, హరిని, గీత, వనిత, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

    శాస్త్రోక్తంగా ఆండాళ్ తిరు నక్షత్రోత్సవం  - Additional Image