శాస్త్రోక్తంగా ఆండాళ్ తిరు నక్షత్రోత్సవం

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వైభవంగా ఆండాళ్ గోదాదేవి జయంతి వేడుకలు హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఆండాళ్ (గోదాదేవి) తిరు నక్షత్రోత్సవం, జన్మదిన వేడుకలను శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ప్రేమ, భక్తి, సేవల ద్వారా సాక్షాత్తు భగవంతుడిని పొందవచ్చని ఆచరించి చూపిన మహాభక్తురాలు ఆండాళ్ గోదాదేవి అని ఈ సందర్భంగా భక్తులు స్మరించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యులు రాజు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రభాత సేవ, తిరుమంజనం, పంచసూక్త పారాయణం, పంచామృత అభిషేకం, ద్రావిడ ప్రబంధ సేవాకాలం, పాశుర పారాయణం, తనియనుల విన్నపం తదితర శాస్త్రోక్త కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....