EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మంతెన సువర్ణ జ్ఞాపకార్థం అల్పాహార పంపిణీ

    Author THADEM PRASHANTH | 14 Aug 2026, 11:45 AM | TELANGANA
    మంతెన సువర్ణ జ్ఞాపకార్థం అల్పాహార పంపిణీ

    జనగామ ఏరియా ఆసుపత్రి వద్ద సేవా కార్యక్రమం
    హిందుస్థాన్ మీడియా, జనగామ: జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రి వద్ద వైద్యం కోసం వచ్చిన ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. కీర్తిశేషులు మంతెన సువర్ణ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు మంతెన మణికుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
    ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కోయాడ రవి, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్‌రాజ్ మాట్లాడుతూ, మంతెన సువర్ణ జ్ఞాపకార్థం అల్పాహారం అందించడం అభినందనీయమన్నారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు.సమాజంలో ఆకలి బాధలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. నిరాశ్రయులు, అనాథలు, నిరుపేద కుటుంబాలు, ఆకలితో ఉన్న వారికి ఆహారం, తాగునీరు అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవాలని యువతకు సూచించారు.
    ఈ సేవా కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కోయాడ రవి, సిద్ధిరాల చందు, సిద్ధిరాల వెంకట్, సాయి తేజ, పిట్టల కృష్ణ, ఉల్లెంగుల మణి తదితరులు పాల్గొన్నారు.

    మంతెన సువర్ణ జ్ఞాపకార్థం అల్పాహార పంపిణీ  - Additional Image