మంతెన సువర్ణ జ్ఞాపకార్థం అల్పాహార పంపిణీ
జనగామ ఏరియా ఆసుపత్రి వద్ద సేవా కార్యక్రమం హిందుస్థాన్ మీడియా, జనగామ: జనగామ అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రి వద్ద వైద్యం కోసం వచ్చిన ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. కీర్తిశేషులు మంతెన సువర్ణ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు మంతెన మణికుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కోయాడ రవి, ప్రధాన కార్యదర్శి వంగ భీమ్‌రాజ్ మాట్లాడుతూ, మంతెన సువర్ణ జ్ఞాపకార్థం అల్పాహారం అందించడం అభినందనీయమన్నారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు.సమాజంలో ఆకలి బాధలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు....