EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించాలి

    Author M KIRAN KUMAR | 13 Aug 2026, 07:17 PM | TELANGANA
    ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించాలి

    కొమురవెల్లిలో మోకు దెబ్బ మండల సమావేశం

    హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ మండల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు మెరుగు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు.
    ఈ సందర్భంగా మెరుగు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా కొమురవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
    అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలి
    జిల్లా అధ్యక్షుడు పచ్చిమట్ల స్వామి గౌడ్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నిర్వహించాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి మండల కేంద్రానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు.
    అర్హులైన గీత కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి
    గీత కార్మికులకు ప్రభుత్వం కొత్తగా పింఛన్లు అందిస్తున్న నేపథ్యంలో అర్హులైన, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ప్రతి గీత కార్మికుడికి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్వామి గౌడ్ కోరారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోని గీత కార్మికులు వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
    ఈ సమావేశంలో మోకు దెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు ముత్యం నరసింహులు గౌడ్, జిల్లా యువజన అధ్యక్షుడు దొమ్మాట రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి ముత్యం విజయ్ కుమార్ గౌడ్, మండల యువజన అధ్యక్షుడు బుడిగే రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, మెరుగు లక్ష్మయ్య, యాదగిరి, గనిబోయిన కనకయ్య, రాములు, కనకయ్య, కిరణ్ తదితరులతో పాటు వివిధ గ్రామాల గౌడ సంఘాల పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.