ఆగస్టు 18న సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించాలి
కొమురవెల్లిలో మోకు దెబ్బ మండల సమావేశం హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ మండల సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు మెరుగు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెరుగు కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా కొమురవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలి జిల్లా అధ్యక్షుడు పచ్చిమట్ల స్వామి గౌడ్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ...