EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇల్లంతకుంట సింగిల్ విండో ఛైర్మన్ గా వెంకటరమణా రెడ్డి

    Author THADEM PRASHANTH | 12 Aug 2026, 08:46 PM | TELANGANA
    ఇల్లంతకుంట సింగిల్ విండో ఛైర్మన్ గా వెంకటరమణా రెడ్డి

    ఉత్తర్వులు అందజేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
    హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్‌ విండో) చైర్మన్‌గా వుట్టుకూరి వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
    రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో వెంకటరమణారెడ్డి నియామక ఉత్తర్వులను అందుకున్నారు.

    గతంలో సెస్ డైరెక్టర్‌గా.. ఎంపీపీగా సేవలు
    వెంకటరమణారెడ్డి గతంలో సెస్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ సెస్ అభివృద్ధికి పాటుపడ్డారని నాయకులు తెలిపారు.
    అనంతరం సోమారంపేట, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, జంగారెడ్డిపల్లి ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) బాధ్యతలు చేపట్టారు. ఎంపీపీగా మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని పేర్కొన్నారు.తాజాగా సింగిల్‌ విండో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.