ఇల్లంతకుంట సింగిల్ విండో ఛైర్మన్ గా వెంకటరమణా రెడ్డి

ఉత్తర్వులు అందజేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హిందుస్థాన్ మీడియా, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్‌ విండో) చైర్మన్‌గా వుట్టుకూరి వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో వెంకటరమణారెడ్డి నియామక ఉత్తర్వులను అందుకున్నారు. గతంలో సెస్ డైరెక్టర్‌గా.. ఎంపీపీగా సేవలు వెంకటరమణారెడ్డి గతంలో సెస్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో మండలంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ సెస్ అభివృద్ధికి పాటుపడ్డారని నాయకులు...