EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చుంచనకోటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ డీసీపీ

    Author P శివశంకర్ | 12 Aug 2026, 07:25 PM | TELANGANA
    చుంచనకోటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ డీసీపీ

    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో నూతనంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట జిల్లా అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ సీసీటీవీ కెమెరాలను లాంఛనంగా ప్రారంభించారు.
    గ్రామంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో 24 గంటలూ నిఘా కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు మరింత సహకారం లభిస్తుందని, గ్రామస్తుల్లో భద్రతాభావం పెరుగుతుందని పేర్కొన్నారు.
    దొంగతనాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకోవడానికి సీసీ కెమెరాల ఫుటేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడంలోనూ కెమెరాలు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.

    ప్రజలు కూడా సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలి: సర్పంచ్ గొర్రె శ్రీనివాస్

    చుంచనకోటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ డీసీపీ - Additional Image

    స్థానిక వ్యాపారులు, ప్రజలు తమ ఇళ్లు, దుకాణాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పోలీసు అధికారులు సూచించారు.సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని అన్నారు. గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరగానే ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా సన్మానించారు.ఇకపై చుంచనకోట గ్రామం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుందని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు కెమెరాలు ఎంతగానోఉపయోగపడతాయని సర్పంచ్ తెలిపారు.
    ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వట్టిపల్లి ఆగయ్య, వార్డు సభ్యులు మంద వెంకట్‌రెడ్డి, వడ్లకొండ వెంకటేశం, శ్రీపతి కమలేష్, శీర్ల శ్రీకాంత్, చేర్యాల సీఐ రమేష్ నాయక్, ఎస్‌ఐ అపూర్వ రెడ్డి, గ్రామ విపిఓ రంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, కారోబార్ రమేష్, గ్రామపంచాయతీ సిబ్బంది, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు

    ఇవి కూడా చదవండి