చుంచనకోటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ డీసీపీ

హిందుస్థాన్ మీడియా, చేర్యాల: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో నూతనంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట జిల్లా అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ సీసీటీవీ కెమెరాలను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో 24 గంటలూ నిఘా కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు మరింత సహకారం లభిస్తుందని, గ్రామస్తుల్లో భద్రతాభావం పెరుగుతుందని పేర్కొన్నారు. దొంగతనాలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు నిందితులను త్వరితగతిన గుర్తించి...