EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా మొగుళ్ల ప్రశాంత్

    Author M KIRAN KUMAR | 12 Aug 2026, 05:25 PM | TELANGANA
    కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా మొగుళ్ల ప్రశాంత్

    ఏకగ్రీవంగా ఎన్నిక.. వార్డు మెంబర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి
    హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా అయినాపూర్ గ్రామం 6వ వార్డు సభ్యుడు మొగుళ్ల ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఆదేశాల మేరకు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ముక్క అనిల్ నేతృత్వంలో కొమురవెల్లి మండల కేంద్రంలో వార్డు మెంబర్ల ఫోరం కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మొగుళ్ల ప్రశాంత్‌ను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
    ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో వార్డు మెంబర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. వార్డు మెంబర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
    వార్డు మెంబర్లకు ఆరోగ్య భద్రత, గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీలకు అతీతంగా వార్డు మెంబర్ల హక్కులు, ఆత్మగౌరవం కోసం పనిచేస్తానని ప్రశాంత్ స్పష్టం చేశారు.
    కమిటీ గౌరవ అధ్యక్షురాలిగా పిన్నింటి రేఖ, గొల్లపల్లి రాజమణి, ఉపాధ్యక్షులుగా ముత్యం స్వప్న, ములుగు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శులుగా చింతల పరశురాములు, చెక్కలి అంజలి, చుంచు శ్రీనివాస్, బ్రాహ్మడ్లపల్లి బాబు, కార్యదర్శులుగా ఎక్కాల దేవి, మహేష్, మాట్ల మురళి, ఐలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.