EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బహుజన ప్రజలు ఏకమై హక్కుల కోసం పోరాడాలి

    Author THADEM PRASHANTH | 12 Aug 2026, 02:14 PM | TELANGANA
    బహుజన ప్రజలు ఏకమై హక్కుల కోసం పోరాడాలి

    బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి: ప్రజాసంఘాల నాయకులు
    హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట జిల్లా, ఆగస్టు 12: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. బహుజన వర్గాల ప్రజలు తమ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకుడు బోయ రాములు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. బహుజన వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
    ఇటీవల వివిధ రాజకీయ కార్యక్రమాల్లో బహుజన వర్గాలకు చెందిన ప్రజలను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ప్రజలు రాజకీయ అంశాలను స్వతంత్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ విధానాలు, ప్రజా సమస్యలపై స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని కోరారు.బహుజన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం వంటి అంశాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
    ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం, మన ఆలోచన సాధన సమితి బీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుడిసె ప్రభురాజ్, మాచవరం మహేందర్, బోదాసు మల్లేశం, వడ్డెర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ, కుక్కల ప్రవీణ్, పరక రవి, డీబీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పోతరాజు శంకర్, సుల్తాన్ రాజు, ఏకలవ్య తదితరులు పాల్గొన్నారు.