EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ లో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా...?? కాముని శ్రీనివాస్

    Author THADEM PRASHANTH | 12 Aug 2026, 06:59 AM | TELANGANA
    తెలంగాణ లో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా...?? కాముని శ్రీనివాస్

    తక్షణమే కాళేశ్వరం జలాలను పంటలకు అందించి రైతులను ఆదుకోవాలి
    హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు, ఆగస్టు : తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నిస్తూ, తక్షణమే కాళేశ్వరం జలాలను ప్రాజెక్టుల ద్వారా పంటలకు అందించి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు.
    మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, రైతుబంధు మాజీ జిల్లా డైరెక్టర్ మేడికాయల వెంకటేశం మాట్లాడారు.
    గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు ముందస్తు ప్రణాళికతో కాళేశ్వరం జలాలను రిజర్వాయర్లలోకి తరలించి రైతులకు సాగునీరు అందించేవారని వారు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను పంటలకు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.

    రంగనాయక సాగర్‌ను నింపాలి
    ప్రస్తుతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోయినా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యంగా కనిపిస్తోందని నాయకులు విమర్శించారు. మిడ్‌మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి రంగనాయక సాగర్‌ను నింపి, ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
    బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఈ సమయానికి రైతులకు సాగునీరు అందించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అయోమయంగా మారిందని అన్నారు.

    25 వేల ఎకరాలకు సాగునీటి అవసరం
    ప్రస్తుతం సుమారు 22 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, టమాట, మిర్చి తదితర పంటలు, అంతర పంటలు సాగు చేశారని, మరో 3 వేల ఎకరాల్లో సాగు చేపట్టే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. సాగు చేసిన పంటలకు నీరు అందకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
    తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ మంత్రులు, నాయకుల పర్యటనలను రైతులతో కలిసి అడ్డుకుని నిలదీస్తామని హెచ్చరించారు. రైతుల సాగునీటి హక్కు కోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్ర, పిన్నింటి అబ్బిరెడ్డి, మేడికాయల వెంకటేశం, ఏలేటి రాజారెడ్డి, కాల్వ ఎల్లం, కట్టుకోజ్వాల వాసు, ధర్మాజీపేట తిరుపతిరెడ్డి, రేగుల దేవయ్య, పుచ్చకాయల సురేందర్‌రెడ్డి, పంపరి కనకయ్య, గొల్లపల్లి రాజశేఖర్‌రెడ్డి, సందేబోయిన ముత్తయ్య, మన్నే ఆనంద్, నముండ్ల శ్రీనివాస్, ఎదుల రాజిరెడ్డి, పిట్ల ప్రేమ్‌చంద్, రామగల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.