తెలంగాణ లో ప్రభుత్వం ఉన్నట్లా.. లేనట్లా...?? కాముని శ్రీనివాస్

తక్షణమే కాళేశ్వరం జలాలను పంటలకు అందించి రైతులను ఆదుకోవాలి హిందుస్థాన్ మీడియా, చిన్నకోడూరు, ఆగస్టు : తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నిస్తూ, తక్షణమే కాళేశ్వరం జలాలను ప్రాజెక్టుల ద్వారా పంటలకు అందించి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, రైతుబంధు మాజీ జిల్లా డైరెక్టర్ మేడికాయల వెంకటేశం మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు ముందస్తు ప్రణాళికతో కాళేశ్వరం జలాలను రిజర్వాయర్లలోకి తరలించి రైతులకు సాగునీరు అందించేవారని వారు తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్...