EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపిని గద్దె దించాలి :ఏఐటీయూసీ

    Author THADEM PRASHANTH | 10 Aug 2026, 02:51 PM | Politics, TELANGANA
    కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపిని గద్దె దించాలి :ఏఐటీయూసీ

    కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు: ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్
    చేర్యాల: కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్ పిలుపునిచ్చారు.
    దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం చేర్యాల పట్టణంలోని అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల ఆధ్వర్యంలో జైల్‌భరో ఆందోళన నిర్వహించారు.
    ఈ సందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులు, రైతులు, ప్రజలకు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు భంగం కలిగించేలా నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చారని విమర్శించారు.కార్మికుల ఉద్యోగ భద్రత, పని గంటలు, హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.రైతులకు నష్టం కలిగించే విద్యుత్, విత్తనాలకు సంబంధించిన విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం మరింత ఉధృతంగా ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
    ఈ కార్యక్రమంలో ఈరి భూమయ్య, కుడిక్యాల బాల్‌మోహన్, నంగి కనకయ్య, గూడెపు సుదర్శన్, ఆత్కూరి కనకయ్య, బియ్య కిష్టయ్య, బీర్ల వెంకటయ్య, కల్యా కళావతి, తు

    మ్మ శాలమ్మ, తుమ్మ ఇస్తారి, తుమ్మ మీనయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.