కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపిని గద్దె దించాలి :ఏఐటీయూసీ
కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు: ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్ చేర్యాల: కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం చేర్యాల పట్టణంలోని అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల ఆధ్వర్యంలో జైల్‌భరో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అందె అశోక్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులు, రైతులు, ప్రజలకు వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. కార్మికులు...