EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రెసెంటేషన్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ

    Author THADEM PRASHANTH | 08 Aug 2026, 06:47 PM | TELANGANA
    ప్రెసెంటేషన్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ

    పోతురాజుల వేషధారణతో విద్యార్థుల సందడి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన వేడుకలు
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని ప్రెసెంటేషన్ హైస్కూల్‌లో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు పోతురాజుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన సందడి, నృత్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి.ఉపాధ్యాయులు సైతం సంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించి, తలపై మోసుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
    ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉందని, విద్యార్థులకు మన పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల ప్రాధాన్యతను తెలియజేయడం ద్వారా వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.పాఠశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించగా, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఉత్సాహంతో బోనాల వేడుకలు వైభవంగా ముగిశాయి.

    ప్రెసెంటేషన్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ  - Additional Image