ప్రెసెంటేషన్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ
పోతురాజుల వేషధారణతో విద్యార్థుల సందడి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన వేడుకలు హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని ప్రెసెంటేషన్ హైస్కూల్‌లో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు పోతురాజుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు చేసిన సందడి, నృత్యాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి.ఉపాధ్యాయులు సైతం సంప్రదాయబద్ధంగా బోనాలను అలంకరించి, తలపై మోసుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో విశిష్ట...