EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆగస్ట్ 10 జైలభరో ను జయప్రదం చేయాలి

    Author THADEM PRASHANTH | 08 Aug 2026, 06:29 PM | Politics, TELANGANA
    ఆగస్ట్ 10 జైలభరో ను జయప్రదం చేయాలి

    రైతులు, కూలీలు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి: ఆలేటి యాదగిరి
    హిందుస్థాన్ మీడియా, మద్దూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, కూలీలకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై మోయలేని భారాలను మోపుతోందని వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ ఆలేటి యాదగిరి ఆరోపించారు. ఈ విధానాలకు నిరసనగా ఆగస్టు 10న మద్దూరులో నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    మద్దూరు, దూల్మిట్ట మండల కేంద్రాల్లో శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జైల్‌భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలేటి యాదగిరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న జైల్‌భరోలో మండలంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, వృత్తిదారులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
    ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడి కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఎం.డి. షఫీ, నాయకులు అల్ద రమేష్, మెడిశెట్టి సాయిలు, రాజు, మురళి, బషీర్ తదితరులు పాల్గొన్నారు.