ఆగస్ట్ 10 జైలభరో ను జయప్రదం చేయాలి

రైతులు, కూలీలు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలి: ఆలేటి యాదగిరి హిందుస్థాన్ మీడియా, మద్దూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, కూలీలకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై మోయలేని భారాలను మోపుతోందని వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ ఆలేటి యాదగిరి ఆరోపించారు. ఈ విధానాలకు నిరసనగా ఆగస్టు 10న మద్దూరులో నిర్వహించనున్న జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మద్దూరు, దూల్మిట్ట మండల కేంద్రాల్లో శనివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జైల్‌భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలేటి యాదగిరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న జైల్‌భరోలో మండలంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు,...