EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి : డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి

    Author THADEM PRASHANTH | 02 Aug 2026, 06:37 PM | Politics, TELANGANA
    కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి : డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి

    హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: కొమురవెల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొమురవెల్లి, చేర్యాల, చేర్యాల టౌన్, దూల్మిట్ట, మద్దూరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
    ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆగస్టు 5వ తేదీలోపు మండల కమిటీలను, ఆగస్టు 15వ తేదీలోపు గ్రామ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు.పార్టీ కోసం నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకే సంస్థాగతంగా ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యదర్శి స్థాయిలో మెరుగైన పనితీరు కనబరిచిన వారికి వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి కల్పిస్తామని, ఆశించిన స్థాయిలో పనిచేయని వైస్ ప్రెసిడెంట్లను తిరిగి కార్యదర్శి హోదాకు డిమోట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ పదవులను హోదాగా కాకుండా బాధ్యతగా భావించి పనిచేయాలని సూచించారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ప్రజలకు వాటిపై పూర్తి అవగాహన కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.