కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి : డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి

హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: కొమురవెల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొమురవెల్లి, చేర్యాల, చేర్యాల టౌన్, దూల్మిట్ట, మద్దూరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్ష రెడ్డి మాట్లాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆగస్టు 5వ తేదీలోపు మండల కమిటీలను, ఆగస్టు 15వ తేదీలోపు గ్రామ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు.పార్టీ కోసం నిజాయితీగా, సమర్థవంతంగా...