EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల -ఆకునూర్ రోడ్డు బాగు చేయాలని ఎంపీ చామలకు విన్నవించిన కొమ్ము సేన

    Author THADEM PRASHANTH | 02 Aug 2026, 05:26 PM | TELANGANA
    చేర్యాల -ఆకునూర్ రోడ్డు బాగు చేయాలని ఎంపీ చామలకు విన్నవించిన కొమ్ము సేన

    ఆర్‌అండ్‌బీ డివిజన్ కార్యాలయం ఏర్పాటుకూ విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన ఎంపీ
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని అంగడి బజార్ నుంచి ఆకునూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వాన్న పరిస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని చేర్యాల మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.
    ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు కొమ్ము రాజేశ్వరి, మహమ్మద్ షరీఫా బేగం రహదారి దుస్థితిని పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో సహా ఎంపీకి వివరించారు. అలాగే, రహదారి మరమ్మతుల కోసం చేర్యాల మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రతిని ఎంపీకి అందజేసి, ఈ సమస్యను రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
    వినతిపై స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే సంబంధిత మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
    ఈ సందర్భంగా చేర్యాలలో ఆర్‌అండ్‌బీ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో చిన్న మండలాల్లో ఆర్‌అండ్‌బీ డివిజన్ కార్యాలయం ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాత తాలూకా కేంద్రం, నియోజక కేంద్రంగా వెలుగొందిన చేర్యాలలో కూడా డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.
    ఈ కార్యక్రమంలో చేర్యాల మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎం.డి. ఖాజా, శనిగారి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.