చేర్యాల -ఆకునూర్ రోడ్డు బాగు చేయాలని ఎంపీ చామలకు విన్నవించిన కొమ్ము సేన
ఆర్‌అండ్‌బీ డివిజన్ కార్యాలయం ఏర్పాటుకూ విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన ఎంపీ హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల పట్టణంలోని అంగడి బజార్ నుంచి ఆకునూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వాన్న పరిస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని చేర్యాల మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు కొమ్ము రాజేశ్వరి, మహమ్మద్ షరీఫా బేగం రహదారి దుస్థితిని పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో సహా ఎంపీకి వివరించారు. అలాగే, రహదారి మరమ్మతుల కోసం చేర్యాల మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ప్రతిని ఎంపీకి అందజేసి, ఈ సమస్యను రోడ్లు–భవనాల శాఖ...