EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ముస్త్యాల రైతు వేదికలో మండల సమీక్ష సమావేశం

    Author THADEM PRASHANTH | 30 Jul 2026, 08:16 AM | TELANGANA
    ముస్త్యాల రైతు వేదికలో మండల సమీక్ష సమావేశం

    *వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, ఉపాధి హామీపై అధికారులకు దిశానిర్దేశం*
    హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండల పరిధిలోని ముస్త్యాల రైతు వేదికలో ప్రత్యేక అధికారి అధ్యక్షతన, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు పాల్గొని అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
    సమావేశంలో ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద వీబీజీ–ఆర్‌ఎంజీపీ (VBG-RAMG) కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టి రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
    మిషన్ భగీరథ అధికారులు బల్క్ వాటర్ సప్లై, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల పనితీరు, అలాగే జలసిరి కార్యక్రమం కింద బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలపై వివరాలు వెల్లడించారు.
    పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, ప్రహరీ గోడలు, మహిళా సంఘాల భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు.
    వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు సోలార్ విద్యుత్ వినియోగం, దాని ప్రయోజనాలు, అందుబాటులో ఉన్న సబ్సిడీ పథకాలపై అవగాహన కల్పించారు.
    ఐసీడీఎస్ (ICDS) అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, ఖాళీ పోస్టుల వివరాలను వివరించగా, ఐకేపీ (IKP) అధికారులు మహిళా సంఘాల పనితీరు, రుణాల పురోగతిపై సమీక్షించారు. మండల పంచాయతీ అధికారి గ్రామపంచాయతీల పనితీరు, నిధుల విడుదల, 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల వినియోగంపై వివరించారు.
    అనంతరం మండలంలోని గ్రామ సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. సమావేశంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.