ముస్త్యాల రైతు వేదికలో మండల సమీక్ష సమావేశం

*వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, ఉపాధి హామీపై అధికారులకు దిశానిర్దేశం* హిందుస్థాన్ మీడియా, చేర్యాల: చేర్యాల మండల పరిధిలోని ముస్త్యాల రైతు వేదికలో ప్రత్యేక అధికారి అధ్యక్షతన, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు పాల్గొని అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద వీబీజీ–ఆర్‌ఎంజీపీ (VBG-RAMG) కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టి రైతులు సద్వినియోగం చేసుకునేలా...