EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

    Author THADEM PRASHANTH | 25 Jul 2026, 02:57 PM | NATIONAL
    కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

    'X' (ట్విట్టర్) వేదికగా రాజీనామా లేఖను పోస్ట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్

    నీట్ పరీక్షా అక్రమాలు, విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్ర మంత్రి

    విద్యార్థుల భవిష్యత్తు, దేశ ఐక్యత కోసమే ఈ నిర్ణయమని ప్రకటన
    ​న్యూఢిల్లీ (హిందూస్థాన్ మీడియా )

    ​దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం మరియు విద్యార్థి సంఘాల సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా శనివారం మధ్యాహ్నం తన అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
    ​*వివరణ ఇస్తూ పోస్ట్ చేసిన లేఖ*
    ​రాజీనామా లేఖను 'X'లో పంచుకున్న ధర్మేంద్ర ప్రధాన్.. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరియు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, యువత తమ చదువులపై, కెరీర్‌పై దృష్టి సారించేలా వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రికి రాజీనామా లేఖను సమర్పించాను" అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తనకు సహకరించిన ప్రధాని మోదీకి, తోటి మంత్రులకు మరియు అధికారులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
    ​ఫలించిన విద్యార్థుల సుదీర్ఘ నిరసనలు
    ​నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ గత కొన్ని వారాలుగా విద్యార్థులు, యువజన సంఘాలు, విపక్షాలు ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసన దీక్షలు, పార్లమెంట్ ముట్టడి ఆందోళనలు నిర్వహించాయి. ప్రారంభంలో ప్రభుత్వం రాజీనామాను తోసిపుచ్చినప్పటికీ, ఆందోళనలు ఉధృతం కావడంతో చివరకు ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.