కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
'X' (ట్విట్టర్) వేదికగా రాజీనామా లేఖను పోస్ట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్షా అక్రమాలు, విద్యార్థుల సుదీర్ఘ ఆందోళనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్ర మంత్రి విద్యార్థుల భవిష్యత్తు, దేశ ఐక్యత కోసమే ఈ నిర్ణయమని ప్రకటన న్యూఢిల్లీ (హిందూస్థాన్ మీడియా ) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం మరియు విద్యార్థి సంఘాల సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా శనివారం మధ్యాహ్నం తన అధికారిక 'X' (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన...