EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్

    Author THADEM PRASHANTH | 23 Jul 2026, 06:58 PM | TELANGANA
    కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్

    బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం
    (మేర్గు కిరణ్ -రిపోర్టర్ )
    హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ గురువారం కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
    స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, కేస్ డైరీలను పరిశీలించిన సీపీ, వాటిని కచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసి స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలను పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
    అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో సమావేశమై వారి పనితీరు, విధుల నిర్వహణపై ఆరా తీశారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
    శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి అంకితభావంతో పనిచేయాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించి వారి ఫిర్యాదులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశించారు.
    ఈ తనిఖీలో సీఐ రమేష్, ఎస్‌ఐ మహేష్ తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

    కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్  - Additional Image