కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ రష్మీ పెరుమాళ్
బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం (మేర్గు కిరణ్ -రిపోర్టర్ ) హిందుస్థాన్ మీడియా, కొమురవెల్లి: సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ గురువారం కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, కేస్ డైరీలను పరిశీలించిన సీపీ, వాటిని కచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసి స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలను పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో సమావేశమై వారి...