EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వేమన శ్రీ చరణ్ సాయి దాస్ కు సన్మానం

    Author THADEM PRASHANTH | 21 Jul 2026, 10:45 PM | TELANGANA
    వేమన శ్రీ చరణ్ సాయి దాస్ కు సన్మానం

    హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలడుగు నాగయ్య కళా పీఠం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద సాహిత్య పురస్కార కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కవి, శ్రీ సరస్వతీ సంసేవకుడు వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ (సిద్దిపేట)ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
    ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు కసిరెడ్డి వెంకటరెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, రామకృష్ణ చంద్రమౌళి, జె.బి. రాజు, గంటా మనోహర్ రెడ్డి, ఇంద్రవెల్లి రమేష్, చంద్రప్రకాశ్ రెడ్డి, రాధాకుసుమ తదితరులు పాల్గొని సాహిత్యం, జానపద సంస్కృతి పరిరక్షణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
    ఈ కార్యక్రమాన్ని శ్రీమతి పాలడుగు సరోజినీ దేవి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. పాల్గొన్న కవులు, సాహితీవేత్తలు జానపద సాహిత్య పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.