వేమన శ్రీ చరణ్ సాయి దాస్ కు సన్మానం
హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలడుగు నాగయ్య కళా పీఠం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద సాహిత్య పురస్కార కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ కవి, శ్రీ సరస్వతీ సంసేవకుడు వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ (సిద్దిపేట)ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు కసిరెడ్డి వెంకటరెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, రామకృష్ణ చంద్రమౌళి, జె.బి. రాజు, గంటా మనోహర్ రెడ్డి, ఇంద్రవెల్లి రమేష్, చంద్రప్రకాశ్ రెడ్డి, రాధాకుసుమ తదితరులు పాల్గొని సాహిత్యం, జానపద సంస్కృతి పరిరక్షణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి పాలడుగు...