EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రగ్స్ కి దూరంగా, లక్ష్యాలకు చేరువగా ఉండాలి. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి

    Author THADEM PRASHANTH | 20 Jul 2026, 03:55 PM | TELANGANA
    డ్రగ్స్ కి దూరంగా, లక్ష్యాలకు చేరువగా ఉండాలి. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి

    *విద్యార్థుల కదలికలపై అధ్యాపకులు నిరంతరం నిఘా ఉంచాలి*
    (రవీందర్ గౌడ్ -రిపోర్టర్ )
    రాజన్న సిరిసిల్ల, హిందుస్థాన్ మీడియా: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడాలని రాజన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పిలుపునిచ్చారు. సోమవారం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ కళాశాలలో తెలంగాణ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
    ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విద్యార్థుల ఆరోగ్యాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రమశిక్షణతో తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.
    విద్యార్థుల ప్రవర్తన, కదలికలపై అధ్యాపకులు నిరంతరం నిఘా ఉంచి, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
    జిల్లాలో డ్రగ్స్ లేదా గంజాయి విక్రయం, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్: 8712671111కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ టీమ్ డీఎస్పీ ఉపేందర్, ఎస్‌ఐ ఉపేందర్ చారి, వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

    డ్రగ్స్ కి దూరంగా, లక్ష్యాలకు చేరువగా ఉండాలి. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి  - Additional Image