డ్రగ్స్ కి దూరంగా, లక్ష్యాలకు చేరువగా ఉండాలి. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి
*విద్యార్థుల కదలికలపై అధ్యాపకులు నిరంతరం నిఘా ఉంచాలి* (రవీందర్ గౌడ్ -రిపోర్టర్ ) రాజన్న సిరిసిల్ల, హిందుస్థాన్ మీడియా: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడాలని రాజన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి పిలుపునిచ్చారు. సోమవారం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ కళాశాలలో తెలంగాణ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు విద్యార్థుల ఆరోగ్యాన్ని, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రమశిక్షణతో తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు....