EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కర్షక యువ శక్తి అధ్యక్షుడిగా పిల్లి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక..!

    Author P శివశంకర్ | 18 Oct 2026, 08:13 PM | TELANGANA
    కర్షక యువ శక్తి అధ్యక్షుడిగా పిల్లి శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక..!

    యువతను సమన్వయం చేసుకుంటూ కాలనీ అభివృద్ధికి శ్రమిస్తా: పిళ్లి శ్రీధర్
    ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    కర్షక యువ శక్తి యూత్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా పిళ్లి శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో అందరి ఏకాభిప్రాయంతో ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు యూత్ సభ్యులు, కాలనీవాసులు శ్రీధర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు పిళ్లి శ్రీధర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన వంతు బాధ్యతగా కాలనీ సమస్యల పరిష్కారానికి, సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, యువతను సమన్వయం చేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో కాలనీని ముందుంచుతానని స్పష్టం చేశారు. ఆయన ఎన్నిక పట్ల అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰