EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గుండెపోటుతో చికెన్ సెంటర్ నిర్వాహకుడు మృతి

    Author R K SRINIVAS | 17 Oct 2026, 03:59 PM | TELANGANA
    గుండెపోటుతో చికెన్ సెంటర్ నిర్వాహకుడు మృతి

    28 ఏళ్ల వయసులోనే ఇసాక్‌ మృతి.. కుటుంబానికి తీరని లోటు
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్‌ 17, హిందుస్థాన్‌ మీడియా: మద్దూరు మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బిస్మిల్లా చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తున్న మహమ్మద్‌ ఇసాక్‌ (28) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. చిన్న వయసులోనే ఆయన మరణించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
    స్థానికంగా అందిన సమాచారం ప్రకారం, శుక్రవారం రాత్రి చికెన్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇసాక్‌ ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలిసింది. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు సమాచారం.
    ఇసాక్‌ తల్లిదండ్రులు గతంలోనే మరణించడంతో, ఆయన తన అన్నతో కలిసి చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తూ కుటుంబ పోషణలో భాగస్వామిగా ఉన్నారు. కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది.
    28 ఏళ్ల వయసులో ఇసాక్‌ మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆయన మృతిపట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.