EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన మద్దూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు

    Author R K SRINIVAS | 15 Oct 2026, 05:53 PM | TELANGANA
    రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన మద్దూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు

    అండర్‌–14 విభాగంలో ప్రతిభ.. విద్యార్థులను అభినందించిన ఉపాధ్యాయ బృందం
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్‌ 15, హిందుస్థాన్‌ మీడియా: మద్దూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీ విద్యార్థులు హ్యాండ్‌బాల్‌ క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్‌ కోట నరేందర్‌ రెడ్డి తెలిపారు.గత నెలలో నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ జిల్లా హ్యాండ్‌బాల్‌ ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అండర్‌–14 రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పాఠశాలకు చెందిన భానోత్‌ గణేష్‌, శనిగరం సంపత్‌, చేర్యాల శివకుమార్‌, గుండె వర్షిణి, బొంగోని సౌమ్యవర్ధిని ఎంపికయ్యారని తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని, పాఠశాలకు, సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్‌ ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను మద్దూరు మండల విద్యాధికారి వరదరాజులు, ప్రిన్సిపాల్‌ కోట నరేందర్‌ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, ఫిజికల్‌ డైరెక్టర్‌ దామెర ప్రేమ్‌ కుమార్‌ అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.