EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆకునూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా??

    Author THADEM PRASHANTH | 14 Oct 2026, 07:52 PM | Array
    ఆకునూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక వాయిదా??

    ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నూతన కమిటీ ఎంపిక
    సిద్దిపేట జిల్లా, చేర్యాల,అక్టోబర్‌ 14, హిందుస్థాన్‌ మీడియా: చేర్యాల మండలం ఆకునూరు గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నికను నిలిపివేసి, ఆ తర్వాత నూతన కమిటీని ఎన్నుకోవాలని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి సూచించినట్లు సమాచారం.ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నూతన కమిటీని ఎంపిక చేయాలని మండల పార్టీ అధ్యక్షుడికి, గ్రామ నాయకులకు ఆయన తెలియజేశారు. ప్రస్తుతం పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
    ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆకునూరు గ్రామ కాంగ్రెస్‌ నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.