EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక: ప్రిన్సిపాల్ అభినవ్

    Author THADEM PRASHANTH | 13 Oct 2026, 07:54 PM | TELANGANA
    బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక: ప్రిన్సిపాల్ అభినవ్

    ప్రకృతిని పూలతో పూజించే సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకం
    సిద్దిపేట జిల్లా, నంగునూరు, అక్టోబర్‌ 13, హిందుస్థాన్‌ మీడియా: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బూరం అభినవ్‌ అన్నారు. మంగళవారం రాజగోపాలపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
    వేడుకలను ప్రారంభించిన ప్రిన్సిపాల్‌ బూరం అభినవ్‌ మాట్లాడుతూ, ప్రకృతిని పూలతో పూజించే సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకమని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వానికి, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
    ఈ సందర్భంగా మహిళా సిబ్బంది, విద్యార్థినులు కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ విశిష్టతను చాటుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు సయ్యద్‌ షాహబాజ్‌, పాతూరి శ్రీనివాస రెడ్డి, వై. రాజు, ఏవో రాజేశ్‌, మహిళా సిబ్బంది కవిత, జ్యోతి, దీపిక, మంజుల, వాణి, బాలమణి, లావణ్య, అనితతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు

    బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక: ప్రిన్సిపాల్ అభినవ్ - Additional Image