EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వంగపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వేణుగోపాల్ ఎన్నిక

    Author R K SRINIVAS | 13 Oct 2026, 07:48 PM | TELANGANA
    వంగపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వేణుగోపాల్ ఎన్నిక

    గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: పండుగ వేణుగోపాల్‌
    సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్‌ 13, హిందుస్థాన్‌ మీడియా: జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి ఆదేశాల మేరకు వంగపల్లి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ శాఖ అధ్యక్షుడిగా పండుగ వేణుగోపాల్‌ ఎన్నికయ్యారు. మద్దూరు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్‌ రెడ్డి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమక్షంలో వేణుగోపాల్‌ను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
    ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పండుగ వేణుగోపాల్‌ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో గ్రామ శాఖ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, గ్రామంలోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

    గ్రామ కాంగ్రెస్‌ నూతన కమిటీ వివరాలు: అధ్యక్షుడిగా పండుగ వేణుగోపాల్‌, ఉపాధ్యక్షులుగా కూరెళ్ల యాదగిరి, ఎర్రబచ్చల బిక్షపతి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కూరెళ్ల రవి, కూరెళ్ల తిరుపతి, ఎర్రబచ్చల వెంకటయ్య, జంగ తిరుపతి, జిల్లెల మధుసూదన్‌ రెడ్డి, చల్ల ఏసు రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. కార్యదర్శులుగా పోతిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, కెంగర్ల సత్తయ్య, కంచర్ల మోహన్‌, కెంగర్ల రవి నియమితులయ్యారు.
    ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సీనియర్‌ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.