EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నర్మెటలో సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం

    Author THADEM PRASHANTH | 12 Oct 2026, 09:15 PM | TELANGANA
    నర్మెటలో సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం

    ఆర్టీఐపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: కట్ట ఎల్లయ్య
    సిద్దిపేట జిల్లా, నంగునూరు, అక్టోబర్‌ 12, హిందుస్థాన్‌ మీడియా: సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నంగునూరు మండలం నర్మేట గ్రామంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కమిటీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కట్ట ఎల్లయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్టీఐ చట్టం ప్రాధాన్యాన్ని వివరించారు.ఈ సందర్భంగా కట్ట ఎల్లయ్య మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పౌరులకు సమాచార హక్కు చట్టం కీలకమైన సాధనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు అవినీతిని అరికట్టేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు చట్టంపై అవగాహన పెంచుకుని, తమకు ఉన్న హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్‌ 12 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొన్న ఆయన, చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ కమిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేర్యాల సాయి తదితరులు పాల్గొన్నారు.